నా కన్నులకి ఆశ నిన్ను చూడాలని..
నా చెవులకి ఆశ నీ మాట వినాలని..
నా పెదవులకి ఆశ నీతో మాట్లాడాలని..
నా కరములకి ఆశ నిన్ను తాకాలని..
నా పాదములకి ఆశ నీతో నడవాలని..
నా మనసుకి ఆశ నీతో స్నేహం చెయ్యాలని..
నా హృదయానికి ఆశ నీలో స్థానం కావాలని..
నాకు ఆశ నువ్వెల్లప్పుడు నవ్వుతూ ఉండాలని.
ఆకాశం అంచులు తాకే ఈ ఆనందం నాలో ఈ వేళ..సొంతం నీ వల్ల..
ఎటు చుసినా నువ్వే..
నా కనుపాపలలో నీ రూపే..
నా ఎద నిండా నీ ఊహలే..
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ నాలో మోఘే గుండెల సవ్వడులే..
ఈ మరపురాని అనుభూతులతో నే జీవిస్తా కలకాలం సంతోషంగా..
నిన్న మొన్నటిదాకా నాతోనే ఉన్న నా ఆనందం నను ఒంటరిని చేసింది..
మనసులేనిచోట తాను ఉండలేను అంటుంది..
నను విడిచి నీకోసం పరుగులు తీస్తుంది..
మళ్లీ వస్తే అది నీతోటే అంటుంది..
ప్రియతమా చూస్తున్నావా ఈ నిజ ప్రేమికుడి సహనం , నాకే స్థానం లేని నా మనసుని , నీకై కన్నీరు కార్చే నా కనులని, ప్రతి క్షణం నీకై ఆలోచించే నా హృదయముని...నిజమైన ప్రేమనినినిని.
నా మది'నది' అనే స్వచ్చమైన నీటిలో అందమైన మీనం నీవు..
నీ చిరునవ్వుకి కారణమని అడిగితే నువ్వంటున్నావ్ 'నది'యై పారే కల్మషం లేని నా కన్నీరని..
నీ కన్నులు చెప్పే భావాలు,మనసు దాచే మాటై రావాలని , భాధై కారే నా కన్నీరు, ప్రేమ అనే ఆనందభాష్పాలుగా మారాలని నా ఆకాంక్ష..
I was totally unread when you left out of me..
after the days passed away in memorising you,now i can read everyone..
my heart became a precise instrument which works every second for you..
thank you for your help in exposing inner side of my.....
be happy forever...